లక్నో: దళిత మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించారు. లాఠీలతో కొట్టడంతోపాటు పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లారు. (Police Thrash Dalit Women) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లావాద్ గ్రామంలో ఒక ఇంటి విషయంపై సోదరులైన అనిల్, సుశీల్ మధ్య వివాదం చెలరేగింది. వారు ఘర్షణ పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కాగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు సోదరులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు చెందిన దళిత మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని లాఠీలతో కొట్టారు. పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకెళ్లారు.
మరోవైపు దళిత మహిళలను పోలీసులు కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. అలాగే జాతీయ మహిళా కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు కూడా దీనిపై ఫిర్యాదులు అందాయి.
కాగా, మీరట్ ఎస్ఎస్పీ విపిన్ టాడా ఈ సంఘటనపై స్పందించారు. ఇంచౌలి పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ నితిన్ పాండే, లావాద్ అవుట్‌పోస్ట్ ఇన్చార్జ్ ఇంద్రేష్ విక్రమ్ సింగ్, ఇన్స్పెక్టర్ సుమిత్ గుప్తా, పవన్ సైనీ, కానిస్టేబుల్ వసీంలను సస్పెండ్ చేశారు. వారందరిపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు.
यूपी : मेरठ में पुलिस ने दलित महिलाओं को लाठियों से पीटा। SO नितिन पांडेय, चौकी इंचार्ज विक्रम सिंह, दरोगा सुमित गुप्ता, पवन सैनी, सिपाही वसीम को लाइन हाजिर किया। मकान विवाद की सूचना पर पुलिस गई थी। इस दौरान ये बर्बरता हुई।pic.twitter.com/2MSQApcUUc
— Sachin Gupta (@SachinGuptaUP) May 12, 2025