Police Station | పోలీస్ స్టేషన్‌కు తాళం.. ఇళ్లలో నిద్రించిన పోలీస్ సిబ్బంది
Police Station | పోలీస్ స్టేషన్‌కు (Police Station) తాళం వేశారు. డ్యూటీలో ఉండాల్సిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంచక్కా ఇళ్లలో నిద్రించారు. సడెన్ చెకప్ కోసం వచ్చిన డీఐజీ ఇది చూసి షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్ అధికారిని సస్పెండ్ చేశారు.
చండీగఢ్: పోలీస్ స్టేషన్‌కు (Police Station) తాళం వేశారు. డ్యూటీలో ఉండాల్సిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంచక్కా ఇళ్లలో నిద్రించారు. సడెన్ చెకప్ కోసం వచ్చిన డీఐజీ ఇది చూసి షాక్ అయ్యారు. పోలీస్ స్టేషన్ అధికారిని సస్పెండ్ చేశారు. పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జలంధర్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) హర్మన్‌బీర్ సింగ్ గిల్, మంగళవారం ఉదయం 7.30 గంటలకు తాండాలోని ఓ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే ఆ పోలీస్ స్టేషన్‌కు లాక్ వేసి ఉంది. నిరాయుధుడైన ఒక పోలీస్ కానిస్టేబుల్ తప్ప మరెవరూ అక్కడ లేరు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), ఇతర పోలీస్ సిబ్బంది తమ ఇళ్లలో నిద్రపోయినట్లు తెలుసుకున్న ఆయన షాక్ అయ్యారు.
కాగా, డీఐజీ హర్మన్‌బీర్ సింగ్ గిల్ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఉదయం 9 గంటల అనంతరం పోలీస్ సిబ్బంది తీరిగ్గా ఆ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన డీఐజీ మరింత ఆగ్రహం చెందారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా తండా ఎస్‌హెచ్‌వోను సస్పెండ్ చేశారు. ఆయనను పోలీస్ లైన్‌కు బదిలీ చేశారు.
Today, DIG Jalandhar Range, made a surprise inspection of Police Station Tanda, Hoshiarpur, at 07:30 AM.
The purpose of this unannounced visit was to ensure compliance with the duty protocol of the Punjab Police. pic.twitter.com/0XWEOBtonE
— Jalandhar Range Police (@JalandharRange) June 18, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

