తిరువన్నామలై, అక్టోబర్ 2: నకిలీ సాధువులను గుర్తించేందుకు తమిళనాడులో పోలీసులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. తిరువన్నామలై జిల్లాలోని అరుణాచలేశ్వర్ ఆలయం సమీపంలో వేలి ముద్రల సేకరణ డ్రైవ్‌ను ప్రారంభించారు. సాధువుల బ్యాక్‌గ్రౌండ్, వారికి ఏమైనా నేర చరిత్ర ఉన్నదా? అనేది తెలుసుకొనేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
అరుణాచలేశ్వర్ ఆలయం కొండ చుట్టూ గిరిప్రదక్షిణం చేసే భక్తులను కొంతమంది నకిలీ సాధువులు అడ్డుకొంటూ, డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తాజా చర్య చేపట్టారు.