CJP protest | నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ( CJP) ఆధ్వర్యంలో సోమవారం ఛలో సంసద్ పేరుతో సెంట్రల్ ఢిల్లీలో(Delhi) నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పార్లమెంట్ చుట్టూ ఉన్న బారికేడ్లను దాటడానికి ప్రయత్నించడంతో భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించి లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఆందోళన కారులతో జంతర్ మంతర్ యుద్ధభూమిని తలపించింది.
అయితే ఆందోళనల సమయంలో ఢిల్లీలో పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. నిరసనకారులపై లాఠీ చార్జ్ (Lathi-charge)చేయడమే కాకుండా 10 ఏళ్ల బాలుడిని(10-year-old boy) సైతం కొట్టడంతో పలువురు ఆందోళన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పిల్లలు అని చూడా కూడా చేయి చేసుకోవడమేంటని పోలీసుల తీరును పలువురు తీవ్రంగా తప్పుడుతున్నారు. పోలీసులు కొడుతుంటే సదరు బాలుడు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పిల్లవాడని కూడా చూడకుండా కొడుతున్న పోలీసులు
ఢిల్లీలో సీజేపీ నిరసన సందర్భంగా 10 ఏళ్ల బాలుడిని చెంపదెబ్బ కొట్టిన పోలీసులు pic.twitter.com/Adlfl627K8
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026