thieves flaunting stolen money | చోరీ చేసిన డబ్బు చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్.. ఒక దొంగ అరెస్ట్
thieves flaunting stolen money | దొంగిలించిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. మంచంపై ఆ డబ్బును పరిచారు. (thieves flaunting stolen money) చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఒక దొంగ అరెస్ట్ అయ్యాడు.
లక్నో: దొంగిలించిన డబ్బును చూసి దొంగలు మురిసిపోయారు. మంచంపై ఆ డబ్బును పరిచారు. (thieves flaunting stolen money) చెల్లాచెదురుగా పడి ఉన్న డబ్బును చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చేశారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఒక దొంగ అరెస్ట్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో ఇటీవల దొంగలుపడ్డారు. భారీగా డబ్బులు దోచుకున్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను కూడా అందజేశాడు.
కాగా, జ్యోతిష్కుడు తరుణ్ శర్మ ఇంట్లో చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగల ఆచూకీని గుర్తించలేకపోయారు. అయితే ఆ దొంగలు చోరీ చేసిన డబ్బును చూసి మురిసిపోయారు. ఆ నగదును మంచంపై పరిచి ఇన్స్టాగ్రామ్ రీల్ చేశారు. ఒక వ్యక్తి తన చేతిలో రూ.500 నోట్లు పట్టుకున్నట్టు ఆ వీడియో క్లిప్‌లో కనిపిస్తుంది.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సాంకేతిక ఆధారాలతో ఒక దొంగ ఆచూకీని గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. రెండు లక్షల డబ్బుతోపాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం ఆరా తీస్తున్నారు.
UP Kanpur : Thief spread bundles of stolen notes on the bed, posted video on Instagram.
-The police caught the accused thief through surveillance, after which around ₹ 200,000 cash and two phones were also recovered from him.https://t.co/Y2xlYc76og
— Mohd. Mobassir مبشر 🇮🇳 (@03_mobassir) October 5, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

