శ్రీనగర్: నిషేధిత లష్కరే తాయిబా సంస్థతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాద సహచరులను జమ్ముకశ్మీర్‌లోని బడ్గాం జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి, స్థానికులను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారి నుంచి తుపాకీ, గ్రనేడ్ వంటి ఆయధాలతో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీన ం చేసుకున్నారు.
2020లో పాకిస్థాన్ పారిపోయి ఉగ్రవాదిగా మారిన ఎల్ఈటీకి చెందిన ఆబిద్ ఖయామ్ లోనెతో వీరికి దగ్గర సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఆబిద్ ఆదేశాల మేరకే వీరు ఇక్కడ పనిచేస్తూ కొత్తగా సంస్థలోకి యువకులు చేరేలా ప్రేరేపిస్తున్నారని తెలిపారు.