ముంబై: ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను తన కారుతో ఈడ్చుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఒక ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు అడ్డుతగిలిన నేరం కింద, ర్యాష్ డ్రైవింగ్ నేరం కింద కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అంధేరిలో వస్త్ర వ్యాపారం చేసే సోహైల్ కటూరియా గత గురువారం ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించి కారులో స్పీడుగా దూసుకెళ్తున్నాడు. ఆజాద్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ విజయ్ సింగ్ అది గమనించి అడ్డుకోబోయాడు.
ఆయిన కటూరి కారును ఆపకుండా మీదకు దూసుకురావడంతో కానిస్టేబుల్ ఆ కారు బానెట్‌పైకి దుమికాడు. దాంతో కారును సైడ్‌కు తీసి ఆపినట్లే చేసిన సోహైల్ కటూరియా జరిమానా తప్పించుకోవడం కోసం ఒక్కసారిగా ముందుకు పోనిచ్చాడు. దాంతో కానిస్టేబుల్ ఒక మూలమలుపు వద్ద కారు స్లోకావడంతో కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.