గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 00:49:52

బడుల్లో పోక్సో ఫిర్యాదు కేంద్రాలు

బడుల్లో పోక్సో ఫిర్యాదు కేంద్రాలు
  • బీహార్‌ ప్రభుత్వం నిర్ణయం
  • చిన్నారులపై లైంగికనేరాల నియంత్రణకు చర్యలు

పాట్నా: చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టేందుకు బీహార్‌ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది.  రాష్ట్రంలోని పాఠశాలల్లో త్వరలో పొక్సో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. మార్చి 1 లోగా అన్ని పాఠశాలల్లో పోక్సో ఫిర్యాదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీహార్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్ట్‌ కౌన్సిల్‌ అధికారులు గతవారం జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేస్తారు. విద్యార్థులు నేరుగా కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కమిటీ వారానికోసారి సమావేశమై ఫిర్యాదులపై చర్చించి, సమీప పోలీస్‌స్టేషన్‌కు వాటిని చేరవేస్తుంది. ప్రయోగాత్మకంగా ఉన్నతపాఠశాలల్లో ఫోక్సో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటుచేసి.. తర్వాత ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనున్నారు.  
logo
>>>>>>