న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) కోసం ప్రపంచ విధానాన్ని రూపొందించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏఐపై విశ్వాసం, పారదర్శకత, నిష్పాక్షికత పెంపొందేందుకు ఈ విధానం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్‌తో కలసి ఏఐ కార్యాచరణ సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాజకీయ, ఆర్థిక, భద్రత, సమాజం వంటి అన్ని రంగాలను ఏఐ మార్చివేస్తోందని తెలిపారు. విలువలు, విశ్వాసం పెంపునకు, ముప్పుల పరిష్కారానికి ఉపయోగపడే విధంగా ఏఐ కోసం ఓ సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు ప్రపంచ దేశాలు కలసికట్టుగా కృషి చేయాలన్నారు.