పనాజీ: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ గోవా పర్యటనలో ఉన్నారు. గోవా లిబరేషన్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. మధ్యాహ్నం పనాజీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి.. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని పనాజీలోని ఆజాద్ మైదాన్‌లోగల అమరవీరుల స్మారకం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించారు. స్మారకంపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి అంజలి ఘటించారు.
అనంతరం గోవా లిబరేషన్ డే సందర్భంగా ఆరేబియా సముద్రంలో నిర్వహించిన సెయిల్ పరేడ్‌కు హాజరయ్యారు. అక్కడ బోట్లతో ఇండియన్ నేవీ చేసిన విన్యాసాలను తిలకించారు. అనంతరం పనాజీలోనే నిర్వహించిన ఫ్లైపాస్ట్‌కు హాజరై వైమానిక దళ విన్యాసాలను వీక్షించారు. ఆ తర్వాత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జి స్టేడియంలో జరుగుతన్న గోవా లిబరేషన్ డే సంబురాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోవా విముక్తి కోసం పోరాడిన వారిని, గోవా స్వేచ్ఛ కోసం 1961లో ఆపరేషన్ విజయ్‌లో పాల్గొన్న వారిని ప్రధాని జ్ఞాపికలు ఇచ్చి, శాలువాలు కప్పి సన్మానించారు.
PM Narendra Modi felicitates the freedom fighters and veterans of ‘Operation Vijay’ as part of Goa Liberation Day celebrations at Dr Shyama Prasad Mukherjee Stadium in Goa pic.twitter.com/XrYutoFNZE
— ANI (@ANI) December 19, 2021
As part of Goa Liberation Day celebrations, PM Narendra Modi attends Sail Parade and FlyPast in Panaji pic.twitter.com/ALeiWwtRBC
— ANI (@ANI) December 19, 2021
#WATCH | Goa: Prime Minister Narendra Modi offers tribute at Martyrs Memorial in Azad Maidan, Panaji pic.twitter.com/CMSmF7XEmh
— ANI (@ANI) December 19, 2021
#WATCH Prime Minister Narendra Modi receives a rousing welcome at Goa Liberation Day celebrations being held at Dr. Shyama Prasad Mukherjee Stadium in Goa
— ANI (@ANI) December 19, 2021
(Source: PMO) pic.twitter.com/tqgPJiifoR