ముంబై: ముంబైలో సముద్రంపై నిర్మించిన దేశంలోని అతిపెద్ద బ్రిడ్జ్‌ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్‌ను అటల్ సేతు(Atal Setu)గా పిలువనున్నారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా దీన్ని పిలుస్తున్నారు. ఈ బ్రిడ్జ్ సుమారు 21.8 కిలోమీటర్ల పొడుగు ఉంది. బ్రిడ్జ్ పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్‌పేయి సేవారి-నహవా సేవా అటల్ సేతు. సుమారు 17,840 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైని ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. దాదాపు రెండున్నర గంటల జర్నీని కేవలం 20 నిమిషాలకు కుదిస్తోంది.
#WATCH | PM Modi inaugurates Atal Bihari Vajpayee Sewari – Nhava Sheva Atal Setu in Maharashtra
Atal Setu is the longest bridge in India and also the longest sea bridge in the country. It will provide faster connectivity to Mumbai International Airport and Navi Mumbai… pic.twitter.com/2GT2OUkVnC
— ANI (@ANI) January 12, 2024
భారత్‌లోనే అతిపొడువైన బ్రిడ్జ్‌గా దీన్ని గుర్తిస్తున్నారు. ఇక దేశంలో సముద్రంపై నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జ్ కూడా ఇదే కానున్నది. డిసెంబర్ 2016లో ప్రధాని మోదీనే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుశస్థాపన చేశారు. ముంబై పోర్టు నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్టు మధ్య దూరాన్ని కూడా తగ్గిస్తుంది.
అంతకముందు ప్రధాని మోదీ .. నాసిక్‌లో పర్యటించారు. అక్కడ ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత కల్రామ్ ఆలయంలో పూజలు చేశారు. నాసిక్‌లో ఉన్న రాంకుండ్లో కూడా ఆయన పూజలు నిర్వహించారు. రాముడిపై సంత్ ఏక్నాథ్ జీ రాసిన భజనలను పాడారు. ఆ ఆలయంలో కాసేపు ఆయన స్వచ్ఛత కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. మాప్ పట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు.
At the Shree Kalaram Temple, I had the profound experience of hearing verses from the Bhavarth Ramayana written in Marathi by Sant Eknath Ji, eloquently narrating Prabhu Shri Ram’s triumphant return to Ayodhya. This recitation, resonating with devotion and history, was a very… pic.twitter.com/rYqf5YR5qu
— Narendra Modi (@narendramodi) January 12, 2024