PM Modi : యూరోపియన్ కమిషన్ (European Commission) అధ్యక్షుడిగా ఉర్సులా వాన్ డెర్ లెయెన్ (Ursula von der Leyen) మరోసారి ఎన్నికయ్యారు. దాంతో ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆయనకు అభినందనలు తెలియజేశారు. భారత్ (India), యూరోపియన్ యూనియన్ (European Union) మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము వేచిచూస్తున్నామని మోదీ పేర్కొన్నారు.
‘యూరోపియన్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైనందుకు మీకు అభినందనలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్. ప్రపంచ శ్రేయస్సు కోసం మీతో కలిసి పనిచేసి భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే సందర్భంగా కోసం ఎదురుచూస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.