PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటన చేపటనున్నారు. ఈ నెల 21న పోలాండ్‌లో పర్యటించనున్నారు. 45 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని పోలాండ్ పర్యటనకు వెళ్తుండడం విశేషం. యూరప్‌లోని పోలాండ్ భారత్‌కు వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతున్నది. ఆ దేశానికి చెందిన 30 కంపెనీలు భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. ఆ దేశంలో భారత్‌కు చెందిన సుమారు 5వేల మంది సైతం విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఇక పోలాండ్ పర్యటన అనంతరం ప్రధారి ఉక్రెయిన్ వెళ్లనున్నారు. 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీతో మోదీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, యుద్ధం ఆపేలా రష్యాను ఒప్పించాలని ఉక్రెయిన్ భారత ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు నేతలు భేటీకానుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే, దాదాపు 30 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటిస్తుండడం ఇదే తొలిసారి.