ఖజురహో(మధ్యప్రదేశ్) : మధ్యప్రదేశ్లోని ఖజురహోలో కెన్-బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును కూడా ఆయన వర్చువల్గా ప్రారంభించారు. కెన్-బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా ఎంపీలోని 10 జిల్లాలకు చెందిన 44 లక్షల మందికి, ఉత్తర్ ప్రదేశ్లోని 21 లక్షల మందికి తాగునీటి అవసరాలు తీరనున్నాయి. పర్యావరణం పై బీజేపీ చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు.