PM Modi | దేశం కష్టాల్లో ఉంటే విపక్షాలకు సంతోషం.. ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు..!
PM Modi | ఇరాన్ (Iran), అమెరికా (USA) యుద్ధంతో అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్నదని, ఇలాంటి సమయంలో విపక్షాలు దేశంలో వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) విమర్శించారు. ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
PM Modi : ఇరాన్ (Iran), అమెరికా (USA) యుద్ధంతో అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్నదని, ఇలాంటి సమయంలో విపక్షాలు దేశంలో వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) విమర్శించారు. ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ (Gujarat) లోని బనస్కాంత (Banaskanta) లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. పీఎం కిసాన్ (PM KISAN) 24వ విడత నిధులను విడుదలచేసిన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల చర్యలను ఖండించారు.
దేశ ప్రజలంతా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంటే.. కొన్ని రాజకీయవర్గాలు మాత్రం దేశ ప్రగతిపట్ల అసంతృప్తిగా ఉన్నాయని ప్రధాని విమర్శించారు. దేశం ఇబ్బందుల్లోపడాలని వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. గల్ఫ్ ఉద్రిక్తతల కారణంగా అనిశ్చిత పరిస్థితులుంటే ఎరువులు, గ్యాస్ కొరత గురించి వదంతులు వ్యాప్తిచేస్తున్నారని, ప్రజల్లో గందరగోళం సృష్టించి మోదీని దెబ్బతీయాలన్నది వారి ప్లాన్ అని మండిపడ్డారు. దేశం కష్టాల్లో ఉండాలని కోరుకునే వీరు సంక్షోభ సమయాల్లో సంతోషిస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రైతులకు అండగా ఉంటామని గతంలో ఇచ్చిన హామీకి తగ్గట్టే తమ ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలవల్ల ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగినా తాము ఆ భారాన్ని రైతులపై పడనివ్వడంలేదని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 24వ విడతలో సుమారు రూ.19 వేల కోట్లను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఆ నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9.34 కోట్లమంది రైతులు లబ్ధిపొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | దేశం కష్టాల్లో ఉంటే విపక్షాలకు సంతోషం.. ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు..!
BRS Protest | భూత్పూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ ధర్నా
ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలి : అదనపు కలెక్టర్ విద్యా చందన
Dhanu-Dinu | సోషల్ మీడియా వేధింపులు.. ‘ది ట్రైటర్స్’ నటుడు ధనుంజయ్‌పై నటి పోలీసు ఫిర్యాదు
ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధి : జడ్పీ సీఈవో నాగలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

