భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఉక్రెయిన్ రష్యా గురించి ప్రస్తావన వచ్చింది. ఉక్రెయిన్ సమగ్రతను, ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కచ్చితంగా గౌరవించాల్సిందేనని ఇరువురూ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా శాంతి సామరస్యాలు వెల్లివిరియాలంటే అంతర్జాతీయ చట్టాలను గౌరవించడమే ఏకైక శరణ్యమని ఇరువురూ అభిప్రాయపడ్డారు.
యుద్ధాన్ని ఆపేసి… చర్చల ద్వారా పరిష్కరించుకుంటే బాగుటుందని మోదీ జాన్సన్‌తో పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలు, భౌగోళిక సమగ్రతపై భారత్‌కు అపారమైన నమ్మకం, గౌరవం ఉన్నాయని మోదీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇక… భారత పర్యటనకు రావాలని ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని జాన్సన్‌ను ఆహ్వానించారు. ఉక్రెయిన్ అంశంతో పాటు భారత్, బ్రిటన్ మధ్య ఉన్న సంబంధాలు, వాటి పురోగతిపై కూడా ఇరువురు నేతలూ మాట్లాడుకున్నారు.