Modi
PM Modi | భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధాని నరేంద్ర మోదీ తలపాగాలో మెరిశారు. ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అనంతరం నుంచి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే దినోత్సవాల్లో వేడుకల్లో తలపాగా కట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 2015 జనవరి 26 నుంచి ప్రతి సంవత్సంవరం ఒక్కో ప్రత్యేక కలిగిన తలపాగా ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ప్రధాని కాషాయరంగు ‘బంధాని’ తలపాగా ధరించారు.
2015లో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగుల్లో ఉన్న తలపాగాను తరలించారు. ముదురు ఆకుపచ్చ, కాషాయం, గులాబీ రంగుల్లో ఉండగా.. తెల్లని చుక్కలున్నాయి. తలపాగాతో నల్లటి సూట్‌ను ధరించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి 66 గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.
2016లో ప్రధానమంత్రి మోదీ ఎరుపు చారలతో పసుపు రంగులోని తలపాగా ధరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డార్క్ క్రీమ్ కలర్ ఫుల్ స్లీవ్ బంద్‌గాలా సూట్‌ను ధరించారు.
2017లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గులాబీ రంగు తలపాగా ధరించారు. ఈ సఫాపై వెండి రంగు క్రాస్ లైన్‌లు ఉన్నాయి. తెల్లటి కుర్తా, దానిపై తెల్లటి చుక్క ఉన్న నల్లటి జాకెట్‌పై మెరిసిపోయారు.
2018లో ప్రధాని మోదీ మల్టికలర్‌లోని తలపాగా ధరించారు. సఫాతో ప్రధాని మోదీ క్రీమ్ కుర్తా, నలుపు రంగు జాకెట్ ధరించారు.
2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట జెండా ఎగురవేసి ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన బహులవర్ణాల్లోని తలపాగా ధరించారు. ఎరుపు, పసుపు రంగులో ఉన్న తలపాగా ధరించారు.
2020లో ప్రధానమంత్రి కాషాయ రంగు ‘బంధేజ్’ తలపాగాను ధరించారు. సాంప్రదాయ కుర్తా పైజామా, దానిపై జాకెట్ ధరించారు. మెమోరియల్ వద్ద అమరవీరులైన సైనికులకు ప్రధాని నివాళులర్పించారు.
2021లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రత్యేక తలపాగాలో కనిపించారు. ఎరుపు రంగు ‘హలారీ తలపాగా’ను ధరించారు. ఈ తలపాగాను జామ్‌నగర్ రాజకుటుంబం ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చింది.
2022 గణతంత్ర వేడుకల్లో ప్రధాని తలపాగాకు బదులుగా టోపీ ధరించి కనిపించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన బ్రహ్మకమల్ క్యాప్ ధరించారు. బ్రహ్మకమల్ ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం.