PM Modi | జీ7 సదస్సుకు మోదీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను కలవనున్న ప్రధాని!
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరుగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపూలియో వేదికగా ఈ సమావేశం జరుగుతున్నది.
న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరుగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపూలియో వేదికగా ఈ సమావేశం జరుగుతున్నది. ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ఇజ్రాయెల్ దాడులతో శిథిలమవుతున్న గాజా స్ట్రిప్‌ను ఆదుకునేందుకు, యుద్ధాలను ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, జపాన్ ప్రధాని ఫునియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ తదితరులు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నది. ఇదే విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (NSA) జాక్ సల్లివన్ మాట్లాడుతూ.. బైడెన్ ప్రధాని మోదీని కలవాలని భావిస్తున్నారని చెప్పారు. అయితే ఈ భేటీకి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదన్నారు. ఇరువురు నేతలు కలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

