PM Modi | న్యూఢిల్లీ : దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో గల ఓఖాను బెట్ ద్వారకతో అనుసంధానిస్తుంది. రూ.979 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మించారు.
మన్కీబాత్కు మూడు నెలలు విరామం
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యువత రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పిలుపునిచ్చారు. మార్చిలో ఎన్నికల నైతిక నియమావళి అమల్లోకి రానుండటంతో మూడు నెలల పాటు మన్ కీ బాత్ ఉండదని వెల్లడించారు.
5 ఎయిమ్స్‌లను ప్రారంభించిన మోదీ
మంగళగిరి (ఆంధ్రప్రదేశ్), రాజ్‌కోట్ (గుజరాత్), భటిండా (పంజాబ్), రాయ్‌బరేలీ (యూపీ), కల్యాణి (పశ్చిమ బెంగాల్) లలో ఎయిమ్స్‌లను ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
సముద్ర గర్భంలో ప్రార్థనలు
గుజరాత్‌లోని ఆరేబియా సముద్ర పంచ్‌కుయి బీచ్‌లో ఆదివారం మోదీ స్కూబా డైవింగ్ చేశారు. సముద్ర గర్భంలోని పురాతన ద్వారక నగరాన్ని సందర్శించారు. ‘ద్వారక నగరంలో ప్రార్థనలు చేయడం, స్కూబా డైవింగ్ చక్కని దైవికానుభూతిని కలిగించింది’ అని ఎక్స్‌లో మోదీ ట్వీట్ చేశారు.