Medaram Jathara | సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం.. మేడారం జాతరపై ప్రధాని మోదీ ట్వీట్
Medaram Jathara | ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర (Medaram Jathara) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు.
Medaram Jathara | ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర (Medaram Jathara) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘మేడారం జాతర.. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్క (Sammakka-Sarakka)లకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు…
— Narendra Modi (@narendramodi) February 21, 2024
నేడు మహా జాతర ప్రారంభం
కాగా, తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళగా భావించే మేడారం మహాజాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది. జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం తరలి వస్తున్నారు.
సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి 8 గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలెబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంటిలో పూజా సామగ్రిని శుద్ధిచేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు, కర్రకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లారబోస్తూ జంపన్నను సాగనంపారు.
కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ ఇవాళ మొదలైంది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివాసీ పూజారులు, మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొస్తారు.
Also Read..
Virat Kohli: అకాయ్ అర్థం ఏంటి.. ఆ పేరెందుకు పెట్టారు ?
KTR | కేటీఆర్ చొరవ.. దుబాయ్‌లో జైలుశిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి
Paracetamol | పారాసిటమాల్‌తో కాలేయానికి ముప్పు.. ఎలుకల్లో ప్రయోగంతో నిర్ధారణ..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

