Virat Kohli: అకాయ్ అర్థం ఏంటి.. ఆ పేరెందుకు పెట్టారు ?
Virat Kohli: విరాట్ కోహ్లీ, అనుష్కా దంపతులకు కొడుకు పుట్టాడు. అతనికి అకాయ్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో కోహ్లీ వెల్లడించాడు. అకాయ్ అని పేరు ఎందుకు పెట్టారో తెలుసుకుందాం.
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ(Virat Kohli), అనుష్కా దంపతులకు కొడుకు పుట్టాడు. అతనికి అకాయ్( Akaay) అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో కోహ్లీ వెల్లడించాడు. ఈ నెల 15వ తేదీన అనుష్కా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పాడు. 2021లో ఆ జంటకు ఓ అమ్మాయి పుట్టిన విషయం తెలిసిందే. ఆ పాప పేరు వామిక. బాబుకు అకాయ్ అని పేరు పెట్టడం వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకుందాం.
అకాయ్ అని పేరు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో తెలియదు. కానీ పేరు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉన్నది. చాలా విశిష్టంగా వినిపిస్తున్న ఆ పేరు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హిందీ పదం కాయ అన్న పదం నుంచి అకాయ్ వచ్చినట్లు భావిస్తున్నారు. కాయ్ అంటే కాయం. అంటే శరీరం అని అర్థం. అకాయ్ అంటే పుష్టికరమైన శరీరం కలవాడని అర్థం వస్తుందని కొందరు భాషా నిపుణులు భావిస్తున్నారు. ఇక టర్కిష్ భాషలో అకాయ్ పదానికి ఓ అర్థం ఉన్నది. మెరిసే చంద్రుడిని అకాయ్ అని ఆ భాషలో పిలుస్తారు.
మగబిడ్డకు అకాయ్ అనే పేరును ఎందుకు పెట్టారో ఇంకా విరుష్కా జోడి అధికారికంగా చెప్పలేదు. కానీ ఇప్పటికే ఆకాయ్ పేరు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది. కొన్ని గంటల్లోనే విరాట్ కోహ్లీ చేసిన పోస్టుకు 50 లక్షల లైక్లు వచ్చేశాయి. బాబుకు జన్మనిచ్చిన విరుష్కా జోడికి క్రికెట్, ఫిల్మ్ రంగాల నుంచి విషెస్ అందుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

