న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో కిసాన్ డ్రోన్లు యాక్టివేట్ చేశారు. ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ స్పందించారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. 100 చోట్ల కిసాన్ డ్రోన్లు పనిచేయడం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. గరుడ ఇండియా స్టార్టప్ చేపట్టిన ప్రయత్నం అద్వితీయంగా ఉందని ఆయన తెలిపారు. వినూత్న టెక్నాలజీ మన రైతుల్ని బలోపేతం చేస్తుందని, దీంతో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని మోదీ అన్నారు. రాబోయే రేండేళ్లలో గరుడ ఏరోస్పేస్ కంపెనీ లక్ష మేడిన్ ఇండియా డ్రోన్లను తయారు చేయనున్నట్లు ప్రధాని చెప్పారు. దీని ద్వారా యువతకు ఉద్యోగవకాలు లభిస్తాయన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఇది కొత్త అధ్యాయం అవుతుందన్నారు. డ్రోన్ రంగంలో ఇదో సరికొత్త మైలురాయి అని, అంతులేని అవకాశాలకు ఆహ్వానం అందిస్తుందన్నారు. పంటలపై క్రిమి సంహారక మందులను చల్లేందుకు వివిధ నగరాల్లో శుక్రవారం ప్రధాని మోదీ 100 కిసాన్ డ్రోన్లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
Glad to have witnessed Kisan Drones in action at 100 places across the country. This is a commendable initiative by a vibrant start-up, @garuda_india.
Innovative technology will empower our farmers and make agriculture more profitable. pic.twitter.com/x5hTytderV
— Narendra Modi (@narendramodi) February 19, 2022