న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ఇవాళ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ(PM Modi). దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు స్థానిక సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పంటల పండుగను జరుపుకుంటారు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. దీన్ని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు. పవిత్రమైన సంక్రాతి పర్వదినాన్ని దేశ ప్రజలు వివిధ ప్రాంతాల్లో తమ స్థానిక సంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారని, ప్రజలకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని సూర్య భగవానుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తన ఎక్స్ అకౌంట్లో మోదీ సంక్రాంతి గ్రీటింగ్స్ చెప్పారు. మంగళకరమైన ఉత్తరాయణం సందర్భంగా హృదయపూర్వక గ్రీటింగ్స్ చెబుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ సంతోషకర సంబరాలు బంధాలను మరింత బలోపేతం చేయాలని, సుఖసంపదలను ఇవ్వాలని, పాజిటివ్ దృక్పథాన్ని నింపాలని తెలిపారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ మాఘ బిహు పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా కూడా ఆయన గ్రీటింగ్స్ తెలిపారు.
संक्रांति के इस पावन अवसर को देश के विभिन्न हिस्सों में स्थानीय रीति-रिवाजों के अनुसार मनाया जाता है। मैं सूर्यदेव से सबके सुख-सौभाग्य और उत्तम स्वास्थ्य की कामना करता हूं।
सूर्यो देवो दिवं गच्छेत् मकरस्थो रविः प्रभुः।
उत्तरायणे महापुण्यं सर्वपापप्रणाशनम्॥ pic.twitter.com/zxGY8H5ZvP
— Narendra Modi (@narendramodi) January 14, 2026
Wishing everyone a happy Uttarayan! pic.twitter.com/gdc2yD8xdP
— Narendra Modi (@narendramodi) January 14, 2026