కోల్కతా : సముద్ర జలాలపై పట్టు సాధించే దిశగా భారత్ డిఫెన్స్ రంగంలో కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. మూడు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ లను కోల్కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశీయ టెక్నాలజీతో తయారైన ఈ నౌకలు రక్షణ రంగంలో ఇండియాను బలోపేతం చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనం అని తెలిపారు.
ఇక నౌకల విషయానికి వసే ్త ఐఎన్ఎస్ దుణగిరి బ్రహ్మోస్ యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులను కలిగి ఉంది. ఐఎన్ఎస్ సంశోధక్ను పోర్టులు, లోతైన సముద్ర మార్గాలు, సముద్ర అధ్యయనం, నావిగేషన్ విధులకు అనువుగా ఉండేలా రూపొందించారు. ఈ మూడు నౌకలను రాడార్లు, సెన్సార్ల సాయంతో నిర్మించారు. శత్రువులను దీటుగా ఎదుర్కోవడం, సముద్ర ఉపరితలంలో ఎలాంటి ప్రతికూల వాతావరణంలో అయినా ఇవి పని చేయగల సామర్థ్యంతో నిర్మించారు.