5 కోట్ల కోసం ఆద్యకళ మ్యాజిక్
‘ఇటేటు రా అంటే.. ఇళ్లంతా నాదే అన్నట్టు’ ఆద్యకళ మ్యూజియం నిర్వాహకుల తీరు ఉన్నది. రూ.5 కోట్ల గ్రాంట్ కోసం మ్యూజియం నిర్వాహకులు ఏకంగా యూనివర్సిటీ భవనాన్నే కబ్జాచేసే కుట్ర జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- ఆదివాసీల పేరిట.. ఆదాయ వనరుల వేట
- తెలుగు యూనివర్సిటీ విద్యార్థుల ఆరోపణలు
- కూలేది వర్సిటీకట! మంచిది మ్యూజియానికట!
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ‘ఇటేటు రా అంటే.. ఇళ్లంతా నాదే అన్నట్టు’ ఆద్యకళ మ్యూజియం నిర్వాహకుల తీరు ఉన్నది. రూ.5 కోట్ల గ్రాంట్ కోసం మ్యూజియం నిర్వాహకులు ఏకంగా యూనివర్సిటీ భవనాన్నే కబ్జాచేసే కుట్ర జరుగుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆద్యకళ మ్యూజియం వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలున్నాయని తెలుగు వర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో 5 గదుల్లో ఇప్పటికే ఆద్యకళ మ్యూజి యం నడుస్తున్నది. వాస్తవానికి ఈ ఐదు గదులను మ్యూజియానికి కబ్జాబెడితే, ఇప్పుడేమో ప్రాంగణం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైఅంతస్తు వర్సిటీకి తీసుకొని, కింద అంతస్తు మ్యూజియానికి ఇవ్వాలని వారు అంటున్నారు.
రెండో అంతస్తు ఇప్పుడు కూలిపోయే దశలో ఉన్నది. ఇప్పటికీ ఈ భవనాన్ని వర్సిటీ వాడటమే లేదు. ‘కూలిపోయినది మాకు.. మంచిగున్నది ప్రైవేట్‌కా? ఇదేం పద్ధతి’ అంటూ విద్యార్థులు, అధ్యాపకులు మండిపడుతున్నారు. ‘ఆదివాసీల పేరిట.. ఆదాయ వనరుల వేట’ దాగి ఉన్నదని విద్యార్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. రూ.5 కోట్ల తతంగాన్ని అర్థం చేసుకొని, నాంపల్లిలోని తెలుగు వర్సిటీ ప్రాంగణాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రైవేట్ వ్యక్తులకు ప్రాంగణాన్ని అప్పగించే విషయమై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి తెలుగు వర్సిటీని కాపాడుకొనేందుకు విద్యార్థులు చేపట్టిన నిరసనలు శనివారం నాటికి పదోరోజుకు చేరుకొన్నాయి. ‘సేవ్ క్యాంపస్’ అంటూ విద్యార్థుల నినాదాలతో వర్సిటీ ప్రాంగణం మార్మోగింది. విద్యార్థుల పోరాటానికి సీనియర్ అధ్యాపకురాలు షేక్ హసీనా సంఘీభావం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

