భారత్ సున్నా.. ఐదో టీ20లోనూ అయ్యర్‌సేన చిత్తు
టీ20 వరల్డ్ చాంపియన్ భారత్‌కు మరో భంగపాటు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వరుసగా రెండో సిరీస్‌లోనూ జట్టుకు వైట్‌వాష్ తప్పలేదు. ఇంగ్లిష్ గడ్డపై చెత్తాటను కొనసాగించిన టీమిండియా శనివారం రాత్రి జరిగిన ఐదో, ఆఖరి టీ20లో 56 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది.
- దంచికొట్టిన బట్లర్, బ్రూక్ 4-0తో ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
సౌతాంప్టన్: టీ20 వరల్డ్ చాంపియన్ భారత్‌కు మరో భంగపాటు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వరుసగా రెండో సిరీస్‌లోనూ జట్టుకు వైట్‌వాష్ తప్పలేదు. ఇంగ్లిష్ గడ్డపై చెత్తాటను కొనసాగించిన టీమిండియా శనివారం రాత్రి జరిగిన ఐదో, ఆఖరి టీ20లో 56 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. జోస్ బట్లర్ (64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 131) అద్భుత శతకానికి తోడు కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 నాటౌట్) విజృంభించడంతో ఆతిథ్య జట్టు సిరీస్‌ను 4-0తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఇచ్చిన 258 పరుగుల ఛేదనలో భారత్ 201/8 స్కోరుకే పరిమితమై ఓడింది.
ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), హైదరాబాదీ తిలక్ వర్మ (25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 53) ఫిఫ్టీలు కొట్టినా జట్టుకు ఓటమి తప్పలేదు. వైభవ్ సూర్యవంశీ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ (27), కెప్టెన్ అయ్యర్ (28) పోరాడినా.. అభిషేక్ (3), శివమ్ దూబే (14), సూర్యాంశ్ షెడ్గే (7), అక్షర్ (3) చేతులెత్తేయడంతో జట్టుకు పరాభవం తప్పలేదు. సామ్ కరన్ మూడు వికెట్లతో దెబ్బకొట్టాడు. తొలుత బట్లర్, బ్రూక్ రెండో వికెట్‌కు 102 బంతుల్లోనే 233 రన్స్ జోడించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 257/3 స్కోరు చేసింది. భారత బౌలర్లలో శివమ్ దూబే మాత్రమే రెండు వికెట్లతో రాణించాడు. బట్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, బ్రూక్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Brook
- Buttler
- India
- Shreyas Iyer
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

