న్యూఢిల్లీ: ప్రజలందరికి ప్రధాని మోదీ (PM Modi) భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో అనందమయ స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాని ట్వీట్ చేశారు.
‘అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందింపజేయుగాక. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’ అని ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Bhogi greetings to everyone. May this special festival enrich the spirit of happiness in our society. I pray for the good health and well-being of our fellow citizens. pic.twitter.com/plBUW3psnB
— Narendra Modi (@narendramodi) January 14, 2022