PM Modi | క్లీనర్, గ్రీనర్ మొబిలిటీపై ఫోకస్ : ప్రధాని మోదీ
PM Modi : స్వచ్ఛమైన, పర్యావరణహిత వాహనాలపై ఆటోమేకర్లు దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
PM Modi : స్వచ్ఛమైన, పర్యావరణహిత వాహనాలపై ఆటోమేకర్లు దృష్టిసారించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. భారత ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చర్ సొసైటీ (SIAM) 64వ వార్షిక సదస్సులో ప్రధాని తన సందేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. భారత ఆటోమొబైల్ రంగం ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపు ఇచ్చారు. ఈ రంగం అధిక ఆర్ధిక వృద్ధికి ఊతం, ఉత్తేజం కల్పించాలని కోరారు.
క్లీనర్, గ్రీనర్ మొబిలిటీ దిశగా ఆటోమొబైల్ రంగం దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఇక ఈ సదస్సులో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్ధగా రూపొందించాలనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఈ దిశగా ప్రయత్నాలు సాగితే ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదుగుతుందని చెప్పారు. ప్రపంచంలోనే మేటి ఆటో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా మనం ఎదగాలని కోరారు. 2070 నాటికి కార్బన్ రహిత మొబిలిటీకి చేరుకోవాలనే లక్ష్యం సాకారం కావాలంటే ఆటోమొబైల్ రంగంలో వినూత్న ప్రక్రియలను ప్రవేశపెట్టడం కీలకమని చెప్పారు. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతూ మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలతో మనం ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లుతున్నామని, పరిశ్రమ వృద్ధికి, నిలకడతో కూడిన వృద్ధికి ఇది కీలకమని అన్నారు.
Read More :
CM Revanth Reddy | తెలంగాణకు సవాల్‌గా భారీ రుణ భారం: సీఎం రేవంత్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- National news
- Pm Modi
- siam
- vehicles
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

