రోమ్: ప్రధాని మోదీ యూరోప్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన ఇటలీ వెళ్లారు. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ .. ఆయనకు స్వాగతం పలికారు. రోమ్‌లో ఆ ఇద్దరూ కలిసి కొన్ని ప్రదేశాలకు వెళ్లారు. ప్రత్యేకంగా తన వాహనంలో మోదీని ఆమె తీసుకెళ్లారు. మోదీకి సాదర స్వాగతం లభించింది. మోదీకి వెల్కం చెబుతూ మెలోనీ తన ఎక్స్ అకౌంట్లో కొన్ని ఫోటోలు పోస్టు చేశారు. ఆ పిక్స్‌తో పాటు రెండు దేశాలకు చెందిన జాతీయ జెండాలతో కూడిన ఎమోజీలను ఆమె పోస్టు చేశారు.
Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026
మోదీ, మెలోని.. రూమ్‌లో ఉన్న కొలోస్సియంను విజిట్ చేశారు. అతి ప్రాచీనమైన ఆ స్టేడియాన్ని ఫ్లావియన్ ఆంఫీథియేటర్గా పిలుస్తారు. రోమ్ నగరం మధ్యలో ఈ కట్టడం ఉంటుంది. కొలోస్సియం వద్ద మోదీ, మెలోనీ దిగిన ఫోటోకు మిలియన్ల సంఖ్యలో ఫాలో అయ్యారు. 60 వేల లైక్స్ వచ్చాయి. వీరి స్నేహంపై సుమారు రెండు వేల మంది కామెంట్ చేశారు.
ఇక మెలోనీతో కలిసి డిన్నర్ చేసిన ఫోటోలను మోదీ పోస్టు చేశారు. అనేక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించామన్నారు. ఇవాళ జరిగే చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.ఇండియా-ఇటలీ మధ్య బంధాన్ని ఎలా బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU
— Narendra Modi (@narendramodi) May 20, 2026