న్యూఢిల్లీ, చెన్నై: టీవీకే పార్టీ బహిరంగ సభలో ప్రాణనష్టంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్, బీజేపీ నేత కే అన్నామలై, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ తదితర రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. గాయపడినవారు సత్వరం కోలుకోవాలని ప్రార్థించారు.
బాలలు సహా అమాయకులు మరణించడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తమిళనాడు గవర్నర్ రవి ట్వీట్ చేశారు. ఈ సంఘటనపై సవివరమైన నివేదికను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. తొక్కిసలాట తర్వాత విజయ్ తిరుచిరాపల్లి విమానాశ్రయంలో కనిపించారు.