‘ఒకే దేశం- ఒకే ఎరువు’ నినాదంతో ప్రధాని మోదీ ఇటీవల ‘ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన’ పేరిట ఓ కొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. ఎరువుల బస్తాపై ‘బీజేపీ’ పార్టీ పేరు స్ఫురణకు వచ్చేలా పథకం పేరును ముద్రించడం వివాదాస్పదంగా మారింది.
ఎరువులపై సబ్సిడీ ముందునుంచే ఇస్తున్నా.. తామే కొత్తగా ఇస్తున్నట్టు బీజేపీ ప్రచారం చేసుకుంటున్నది. త్వరలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ ఇలా గోల్మాల్ మార్కెటింగ్‌కు తెరతీసిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.