Rajinikanth Birthday: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు
Rajinikanth Birthday: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన అసాధారణ నటన, సృజనాత్మకతతో రజినీకాంత్ ఇకముందు కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపుతూనే ఉండాలని

న్యూఢిల్లీ: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన అసాధారణ నటన, సృజనాత్మకతతో రజినీకాంత్ ఇకముందు కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపుతూనే ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. ‘రజినీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇకముందు కూడా తన సృజనాత్మకత, అసాధారణ నటనతో ప్రజల్లో స్ఫూర్తి నింపాలని ఆకాంక్షిస్తున్నా’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ‘నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో నివసించేలా ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా, రజినీకాంత్ 1950, డిసెంబర్ 12న జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు శివాజీరావు గైక్వాడ్ అనే పేరు పెట్టారు. అయితే తమిళ సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కే బాలచందర్ ఆయనకు రజినీకాంత్ అని నామకరణం చేశారు. 1975లో బాలచందర్ అపూర్వ రాగంగల్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా రజినీకాంత్ సినీరంగానికి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆయన సహనటుడి పాత్రలో నటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

