న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రబలిన తర్వాత 2020 మార్చిలో స్థాపించిన ్రప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్స్(పీఎం కేర్స్) ఫండ్‌కు విరాళాలు భారీగా తగ్గిపోయాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధికి అందిన విరాళాలు కేవలం రూ.912 కోట్లు మాత్రమే.
2020-21లో రూ.7,184 కోట్ల విరాళాలు లభించగా 2021-22లో రూ.1,938 కోట్లు మాత్ర మే లభించాయి. 2021 తర్వాత విదేశీ విరాళాలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ఈ ఫండ్ నుంచి 2022-23లో మొత్తం వ్యయం రూ.439 కోట్లు గా ఉంది. ఇందులో రూ.346 కోట్లను కొవిడ్ కాలంలో పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ నిధికి వినియోగించినట్టు అధికారులు చెప్పారు.