E-Commerce For SHGs |స్వయం సహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీ) ఉత్పత్తుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేయనున్నది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ రెడ్‌ఫోర్ట్‌పై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి మాట్లాడుతూ సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌ల ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఎనిమిది కోట్ల మందికి పైగా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లతో అసోసియేట్ అయి ఉన్నారు. వారంతా సొంతంగా ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వాటి విక్రయానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తే దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్కెట్ లభిస్తుంది. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు.