శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే వరకు ప్రభుత్వ ఏర్పాటును బహిష్కరించాలన్న అవామీ ఇత్తెహాద్ పార్టీ (ఏఐపీ) అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రషీద్ పిలుపుపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మండిపడ్డారు. రషీద్ బీజేపీతో చేతులు కలిపి నాటకాలాడుతున్నారని విమర్శించారు. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే కేంద్ర పాలనను బీజేపీ పొడిగిస్తుందని అన్నారు. ఇంజినీర్ రషీద్‌గా పిలిచే బారాముల్లా ఎంపీ మీడియా సమావేశంపై ఒమర్ అబ్దుల్లా స్పందించారు. బీజేపీతో చేతులు కలిపి ఆయన నాటకాలాడుతున్నారని ఎక్స్‌లో విమర్శించారు. ‘ఆ వ్యక్తి (రషీద్) 24 గంటలపాటు ఢిల్లీకి వెళ్లాడు. నేరుగా బీజేపీతో చేతులు కలిపి నాటకాలు ఆడేందుకు ఇక్కడి తిరిగి వచ్చాడు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనట్లయితే, జమ్ముకశ్మీర్‌లో కేంద్ర పాలనను పొడిగించడం కంటే బీజేపీకి ఇంకేమీ ఇష్టం లేదు’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను 2019 ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇది జరిగిన తర్వాత తొలిసారి, అలాగే పదేళ్ల విరామం తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌తోపాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి.
The man goes to Delhi for 24 hours and comes back to play straight in to the hands of the BJP. The BJP would like nothing more than to extend central rule in J&K if they aren’t in a position to form a government. https://t.co/d2AK2r6Mjm
— Omar Abdullah (@OmarAbdullah) October 7, 2024