న్యూఢిల్లీ: పెట్ క్లినిక్‌లో ఉన్న పెంపుడు కుక్కతో సరదాగా ఆడేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. తొలుత చాలా కూల్‌గా ఉన్న ఆ కుక్క ఉన్నట్టుండి వైలెంట్‌గా మారింది. (Pet Husky Turns Violent) ఆ వ్యక్తిపై అది దాడి చేసింది. అతడి చేతిని నోటితో గట్టిగా పట్టుకున్నది. దీంతో ఆ కుక్క నోటి నుంచి చేతిని విడిపించుకునేందుకు ఆ వ్యక్తి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫిబ్రవరి 11న ఒక పెట్ క్లినిక్‌లోని సోఫాలో ఇద్దరు వ్యక్తులు కూర్చొన్నారు. ఆ రూమ్‌లో ఒక పెంపుడు కుక్క ఉంది. అది ఉత్సాహంగా అక్కడ తిరిగింది.
కాగా, సోఫాలో కూర్చొన్న ఒక వ్యక్తి ఆ కుక్కను చూసి సరదాపడ్డాడు. దానిని పట్టుకుని నిమరసాగాడు. మొదట కూల్‌గా ఉన్న ఆ కుక్క ఉన్నట్టుండి వైలెంట్‌గా మారింది. ఆ వ్యక్తి చేతిని నోటితో గట్టిగా పట్టుకుంది. అతడు తన చేతిని వదిలించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ కుక్క అతడిపై మరింతగా దాడి చేసింది. ఈ నేపథ్యంలో దాని నోట్లో ఉన్న చేతిని విడిపించుకునేందుకు ఆ వ్యక్తి చాలా శ్రమించాడు. చివరకు క్లినిక్ డోర్ నుంచి బయటకు కుక్కను నెట్టి దాని బారి నుంచి తప్పించుకున్నాడు.
మరోవైపు పెట్ క్లినిక్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఉత్సాహంగా ఉన్న పెంపుడు కుక్క ఉన్నట్టుండి అలా ఎందుకు ప్రవర్తించిందో అన్నదానిపై ఆన్లైన్లో చర్చకు దారి తీసింది. కుక్కను ఆ వ్యక్తి రెచ్చగొట్టి ఉంటాడని ఒకరు అనుమానించారు. జాలీగా ఉన్న ఆ కుక్క జోలికి అతడు వెళ్లకుండా ఉండాల్సిందని మరొకరు అభిప్రాయపడ్డారు. పెంపుడు కుక్కలు అప్పుడప్పుడు ఇలా కొరుకుతాయన్నది అర్థం చేసుకునేదే అని ఒకరు పేర్కొన్నారు.
Pet Dog attacks on a Guy who was Playing with the Dog inside Clinic
pic.twitter.com/PAZaXZRoqS— Ghar Ke Kalesh (@gharkekalesh) February 14, 2025