Supreme Court | విశ్రాంత హైకోర్టు జడ్జిలకు.. ఇంత తక్కువ పింఛనా?.. సుప్రీంకోర్టు ఆవేదన
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల్లో కొందరికి నెలకు రూ.10,000-15,000 పింఛను ఇస్తుండటం పట్ల సుప్రీంకోర్టు బుధవారం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంలో చట్టపరమైన వైఖరిని కాకుండా, మానవీయ దృక్పథాన్ని అనుసరించాలని ప్రభుత్వాన్ని కోరింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జిలకు వేర్వేరు పద్ధతుల్లో పింఛను ఇస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది.
Supreme Court | న్యూఢిల్లీ : హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల్లో కొందరికి నెలకు రూ.10,000-15,000 పింఛను ఇస్తుండటం పట్ల సుప్రీంకోర్టు బుధవారం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంలో చట్టపరమైన వైఖరిని కాకుండా, మానవీయ దృక్పథాన్ని అనుసరించాలని ప్రభుత్వాన్ని కోరింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జిలకు వేర్వేరు పద్ధతుల్లో పింఛను ఇస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. జిల్లా న్యాయ వ్యవస్థ నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినవారు నూతన పింఛను పథకం పరిధిలోకి వస్తున్నారు.
బార్ నుంచి హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి పొందినవారికి పాత పింఛను పథకం వర్తిస్తున్నది. ఫలితంగా హైకోర్టు జడ్జిగా పని చేసి, పదవీ విరమణ పొందిన వారికి పింఛను మొత్తం వేర్వేరుగా ఉంటున్నది. అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం వద్ద ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, తమ జోక్యం లేకుండా సమస్య పరిష్కారమయ్యేలా ప్రభుత్వానికి నచ్చజెప్పాలని కోరింది. తదుపరి విచారణ వచ్చే నెల 8న జరుగుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

