తిరువనంతపురం, అక్టోబర్ 20: కర్ణాటకలో బీజేపీతో ఎల్డీఎఫ్ కూటమి భాగస్వామిపక్షం జేడీఎస్ పొత్తుకు కేరళ సీఎం విజయన్ అంగీకారం తెలిపారని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను విజయన్ ఖండించారు.
దేవెగౌడ వ్యాఖ్యలు నిరాధారమని శుక్రవారం స్పష్టంచేశారు. దేవెగౌడ తన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని సూచించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, కేరళలో లెఫ్ట్ఫ్రంట్తో కలిసి బలంగా నిలబడతామని జేడీ(ఎస్) రాష్ట్ర విభాగం స్పష్టంచేసినట్టు విజయన్ వెల్లడించారు.