తిరువనంతపురం, డిసెంబర్ 31: మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే కేరళను మినీ పాకిస్థాన్‌గా సంబోధించడాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ మంగళవారం ఖండించారు. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని.. కేరళ పట్ల సంఘ్ పరివార్ వ్యవహరించే తీరు మంత్రి మాటల్లో వ్యక్తమైందని ఒక ప్రకటనలో తెలిపారు.
విభజన, విద్వేషాల వ్యాప్తి ద్వారా కేరళలో పట్టు సంపాదించాలని సంఘ్ పరివార్ ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన మంత్రికి, ఆ స్థానంలో కొనసాగే అర్హత లేదన్నారు.