న్యూఢిల్లీ, అక్టోబర్ 10 : ఇటీవలి కాలంలో తరచూ సాంకేతిక సమస్యలు పెరుగుతున్న క్రమంలో ప్రయాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే నిరంతర పరిశీలనలో ఉన్న అన్ని బోయింగ్ విమానాలను నిలిపివేయాలని భారత పైలట్ల సమాఖ్య (ఎఫ్ఐపీ) డిమాండ్ చేసింది.
ఈ మేరకు పౌర విమానయాన శాఖకు లేఖ రాసింది. బీ-787 ఇంజన్లు ఉన్న అన్ని ఎయిర్ ఇండియా విమానాల సర్వీసులను నిలిపివేసి, వాటికి సమగ్రంగా పరీక్షలు నిర్వహించాలని, ముఖ్యంగా ఎలక్ట్రికల్ వ్యవస్థలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని కోరింది.