తిరువనంతపురం: గుర్తింపు పొందిన వైద్య అర్హత ఉంటే తప్ప ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు తమ పేరు ముందు ‘డాక్టర్’ అనే పదం వాడుకోకూడదని కేరళ హైకోర్ట్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏపీఎంఆర్ పిటిషన్పై విచారణ చేశాక కోర్ట్ ఈ తీర్పు ఇచ్చింది.
ఫిజియోథెరపీ కోర్సు కోసం రూపొందించిన పాఠ్యాంశాల్లో డాక్టర్ అనే పదాన్ని తొలగించాలని తొలుత తాను ఇచ్చిన ఆదేశాలను ఇటీవల కేంద్ర వైద్య శాఖ ఉపసంహరించుకుంది. దీనిపై ఐఏపీఎంఆర్ పిటిషన్ దాఖలు చేసింది.