కాన్పూర్, జనవరి 18: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఐఐటీలో పీహెచ్డీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. గురువారం ఉదయం హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. నెల వ్యవధిలో ఇక్కడ ఇది మూడో ఘటన. జార్ఖండ్‌లోని దంకాకు చెందిన ప్రియాంక ఐఐటీ కాన్పూర్‌లో కెమికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్డీ చేస్తున్నది. తండ్రి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ప్రియాంక లిఫ్ట్ చేయకపోవడంతో హాస్టల్ మేనేజర్‌కు కాల్చేశారు.
ఆమె ప్రియాంక గదికి వెళ్లిచూడగా, లోపలి నుంచి గడియపెట్టి ఉన్నది. తలుపు పగులగొట్టి చూడగా ప్రియాంక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించింది. పోలీసులు, ఫోరెన్సిక్ నిఫుణులు ఘటనా స్థలికి చేరుకొని ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ప్రియాంక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.