(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగా ణ): కేరళలోని పినరయి విజయన్ సర్కారు అ సాధారణ చర్యకు దిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి జాప్యం చేస్తున్నారని, అందుకుగల కారణాలనైనా వివరించడం లేదని ఆరోపించింది. యూనివర్సిటీల చట్టం సవరణ బిల్లు సహా మొత్తం నాలుగు బిల్లులు రాష్ట్రపతి దగ్గరే రెండేండ్లుగా పెండింగ్లో ఉన్నట్టు తెలిపింది. వీటిలో మొత్తం ఏడు బిల్లుల్లో నాలుగు బిల్లులను రాష్ట్రపతికి పంపించారని, అక్కడ కూడా జాప్యమే జరుగుతున్నదని తెలిపింది. ఈ విధంగా బిల్లులను తొక్కిపెట్టడం రాజ్యా ంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది.