కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో గల ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ ఆలయానికి పెటా సంస్థ ఓ రోబో ఏనుగును అందజేసింది. 800 కిలోల బరువు, 11 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఏనుగును ఇనుప ఫ్రేమ్, రబ్బర్‌తో తయారుచేశారు. ఇందుకు రూ.5 లక్షలు ఖర్చు అయ్యింది.
ఈ ఏనుగులో 5 ఎలక్ట్రిక్ మోటర్లున్నాయి. దీనిపై ఐదుగురు కూర్చునే అవకాశం ఉంటుంది. ఆలయంలో ‘నడయిరుతుల్’ ఉత్సవం సందర్భంగా ఈ రోబో ఏనుగును ఉపయోగిస్తున్నారు.