లక్నో: ఒక వ్యక్తి పెంపుడు కుక్కతో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే దానికి మెడకు ఉన్న బెల్ట్ జారిపోయింది. దీంతో ఆ కుక్క రైలు పట్టాల మధ్యలో పడిపోయింది. (Pet Dog Falls Into Track) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే పట్టీతో పట్టుకున్న పెంపుడు కుక్కతో కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు.
కాగా, మెడలోని పట్టీ విడిపోవడంతో ప్లాట్‌ఫారమ్ గ్యాప్ నుంచి రైలు పట్టాల్లోకి ఆ కుక్క జారిపోయింది. ఒక వైపు రైలు వెళ్తుండగా ఆ కుక్కకు ఏం అయ్యిందో అని అక్కడున్న వారంతా ఆందోళన చెందారు. యజమాని కూడా తన కుక్క కోసం ఆ గ్యాప్‌లో వెతికాడు. అయితే అదృష్టవశాత్తు ఆ కుక్క ప్రాణాలతో బయటపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అది గాయపడినట్లు తెలిసింది.
మరోవైపు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పెంపుడు కుక్కతో నిర్లక్ష్యంగా రైలు ఎక్కి దానిని ప్రమాదంలో పడేసిన యజమానిపై చాలా మంది ఆగ్రహించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు, పలువురు డిమాండ్ చేశారు. రైల్వేతో పాటు రైల్వే మంత్రికి ట్యాగ్ చేశారు.
When money can’t buy wisdom! pic.twitter.com/suADun73fu
— Trains of India (@trainwalebhaiya) April 1, 2025