గాంధీనగర్:‘ఫైర్ హెయిర్‌కట్’ వికటించడంతో ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాడ్ జిల్లా వాపీ పట్టణంలో బుధవారం జరిగింది. యువకుడి తల వరకూ టవల్‌తో కప్పేసిన హెయిర్‌డ్రెస్సర్ అగ్గిపుల్లతో వెంట్రుకలను కాలుస్తూ కటింగ్ చేసే ప్రయత్నం చేసే ప్రయత్నంలో మంటలు అదుపుతప్పి యువకుడి తలనుంచి మెడవరకూ వ్యాపించాయి.