Assembly Election Results 2023: కాంగ్రెస్కు ప్రజలు బుద్దిచెప్పారు: శివరాజ్ సింగ్ చౌహాన్
Assembly Elections 2023: కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా మధ్యప్రదేశ్ ప్రజలు మాత్రం తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని చౌహాన్ చెప్పారు. తమపై వ్యతిరేకత ఉన్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేసినా...
Assembly Election Results 2023: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు షాకిస్తున్నాయి. ఈసారి హస్తం పార్టీకి విజయం తథ్యమని అక్కడి నాయకులు భావించినా ప్రజలు మాత్రం తమకే మద్దతు ఇచ్చారని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా మధ్యప్రదేశ్ ప్రజలు మాత్రం తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని చౌహాన్ చెప్పారు. తమపై వ్యతిరేకత ఉన్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేసినా ఫలితాల ద్వారా ప్రజలు వాటికి సరైన సమాధానం చెప్పారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్ లతో ఫలితాలను తన అధికారిక నివాసంలో వీక్షించారు. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో మధ్యాహ్నం 2 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం బీజేపీ 161 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 66 స్థానాల్లో గెలిచింది. బీఎస్పీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

