పాట్నా: జంతు బలిని అడ్డుకున్న పోలీసులపై ఓ వర్గం ప్రజలు దాడి చేశారు. బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లాలోని డియోరియాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ప్రార్థనల అంతరం జంతువులను బలి ఇచ్చేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే ఈ ఏడాది జంతు బలిని ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని, ఆ వర్గం చేసుకున్న ఒప్పందం గురించి పోలీసులు వారికి చెప్పారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి చేసి అక్కడి నుంచి తరిమికొట్టారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. నిందితులను గుర్తించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నదని అన్నారు.
#WATCH | People clashed with police over prohibition on animal sacrifice in Deoria, Muzaffarpur in Bihar y'day
— ANI (@ANI) August 21, 2021
On last Friday of Sawan, people offer prayers & sacrifice animals. In a meeting, it was decided that there would be a ban on sacrifice this year: SDM (West) Anil Kumar pic.twitter.com/MmFoStRDBh