న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) హవా నడుస్తున్న కాలంలో ఇంకా యూపీఎస్సీ ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఏండ్ల తరబడి ప్రిపేర్ అవ్వడం అర్థ రహితమని ప్రధాని ఆర్థిక సలహాదారు, ఆర్థిక వేత్త సంజీవ్ సన్యాల్ అభిప్రాయపడ్డారు. సోమవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఏఐ, ఆటోమేషన్ ప్రస్తుత శకాన్ని నిర్వచిస్తున్న సమయంలో ఇంకా 20వ శతాబ్దపు కెరీర్ నమూనాలను పట్టుకొని వేలాడొద్దని ఆయన సలహా ఇచ్చారు. పాత కెరీర్ నమూనాలు 21వ శతాబ్దపు సవాళ్లకు సరిపోవన్నారు.