యాదగిరిగుట్ట: చంద్రయాన్-3 విజయంలో యాదగిరి గుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఇస్రోలో పని చేసేందుకు కావాల్సిన ఉద్యోగుల కాంట్రాక్టును పెద్దకందుకూరు పీఈఎల్కు కేటాయించగా 400 మంది ఉద్యోగులను ఎంపిక చేశారు. వారు ఇస్రోలో పలు హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా చంద్రయాన్-3లో వినియోగించే సాలిడ్ ప్రొపైలెంట్ బూస్టర్ తమ ఉద్యోగులే తయారు చేశారని పీఈఎల్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్ దుర్గాప్రసాద్ తెలిపారు. దీంతోపాటు 6 పీఎస్ఎల్వీ బూస్టర్లను తయారు చేయాలని తమకు ఇస్రో కాంట్రాక్ట్ ఇచ్చిందని, కాటేపల్లిలో గల పీఈఎల్లో 3 బూస్టర్లను తయారు చేశామని వివరించారు.